నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

MNCL: జన్నారం మండలంలోని పలు గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో మోస్తారు వర్షం పడింది. ఈదురు గాలులతో జన్నారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో విద్యుత్ తీగలు పడిపోయాయి. దీంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి పునరుద్దరణ పనులు చేపట్టారు.