13న వాహనాల వేలం

చిత్తూరు: పలు కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 13వ తేదీన తవణంపల్లి పోలీస్టేషన్లో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. జిల్లా అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ క్రిష్ణకుమార్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు స్థానిక పోలీస్ స్టేషన్లో నిర్ణయించిన రుసుం చెల్లించి వేలంలో పాల్గొనవచ్చన్నారు.