మహిళను కాపాడిన పోలీసులు

మహిళను కాపాడిన పోలీసులు

KKD: ఆత్మహత్యకు యత్నించిన వివాహితను కాకినాడ పోలీసులు క్షణాల్లో కాపాడారు. జగన్నాథపురం సమీపంలోని ఎన్‌.టి.ఆర్‌ బ్రిడ్జిపై సోమవారం సుమారు 40 ఏళ్ల మహిళ ఉప్పుటేరులోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బాబురావు, పోలీస్‌ కానిస్టేబుల్‌ అప్పన్న ఆమెను పట్టుకొని కింద పడకుండా ఆపారు.