'కార్మికులకు జీతాలు పెంచాలి'

NTR: విజయవాడలో మున్సిపల్ ఇంజినీరింగ్, పార్కులు తదితర కార్మికుల సమ్మె శనివారం నాలుగో రోజుకి చేరుకుంది. ఈ సమ్మెలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు మద్దతు పలికారు. కార్మికులకు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు పైసా వేతనం పెంచలేదన్నారు. సంక్షేమ పథకాలు వీరికి వర్తింపచేయటం లేదన్నారు. ఇప్పటికే పథకాలు పొందుతున్న వారికి రద్దు చేయడం దుర్మార్గమన్నారు.