'చేనేత సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా'

KDP: చేనేత కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. శనివారం సిద్ధవటంలో ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వాటికి త్వరలో పరిష్కారం మార్గం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు.