15 లీటర్ల నాటు సారా ధ్వంసం

15 లీటర్ల నాటు సారా ధ్వంసం

SKLM: నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా సోంపేట ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ కె.బేబీ సోంపేట మండలం బాతుపురం గ్రామంలో దాడులు నిర్వహించి 5 లీటర్ల నాటు సారాను సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అదేవిధంగా కంచిలి మండలం ఎస్.ఆర్.సి పురం గ్రామంలో 10 లీటర్ల నాటు సారాను సీజ్ చేసి మరో వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.