ఆకివీడులో అంగన్వాడీల మానవహారం

W.G: ఆకివీడు మండలం అంగన్వాడి టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం గాంధీ బొమ్మ సెంటర్‌లో మానవహారం నిర్వహించారు. అంగన్వాడీలకు కనీస వేతనాలు వెంటనే పెంచాలని అలాగే అందరికీ కొత్త స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాల్లో అంగన్వాడీలకు కూడా చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.