'చట్ట సభలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి'

MHBD: మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నేడు చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ఐక్య బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బీసీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు కుమార్ ఆధ్వర్యంలో బీసీలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.