ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ కోరారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ మ్యారేజ్ స్కీం పథకం కింద కులాంతర వివాహాలకు రూ.2.5 లక్షలు ఆర్థిక సహాయం అందచేస్తుందన్నారు. దంపతులలో ఒకరు ఎస్సీ, మరొకరు ఇతర కులానికి చెందినవారై ఉండాలని తెలిపారు.