ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
PLD: మాచవరంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేపట్టిన ఉపాధి హామీ పనులపై గ్రామ సభలు నిర్వహించినట్లు ఏపీవో కోటిరెడ్డి తెలిపారు. మాచవరం, పిల్లుట్ల, గంగిరెడ్డిపాలెం సహా ఏడు గ్రామాల్లో ఈ సభలు జరిగాయి. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. పనుల్లో పారదర్శకత ఉండేలా సామాజిక తనిఖీ నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.