'బీసీ వర్గాల అభివృద్ధికి సహాయ సహకారం అందజేస్తాం'
BDK: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీ ప్రజల సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేతో వారు చర్చించారు. బీసీ వర్గాల అభివృద్ధికి తన వంతు తగిన సహాయ సహకారాలు అందజేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు.