'బానిసలుగా మారి జీవితం నాశనం చేసుకోవద్దు'
GNTR: డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ అన్నారు. తాడేపల్లి వడ్డేశ్వరంలోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో బుధవారం డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల అలవాటు పెద్ద సవాలుగా మారిందన్నారు. వాటికి బానిసలుగా మారి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని వారికి సూచించారు.