VIDEO: 'ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి'
ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని బోస్రా గ్రామస్తులు పేర్కొన్నారు. బజార్హత్నూర్ మండలంలోని బోస్రా గ్రామంలో అఖండ శివనామ సప్తహ కార్యక్రమాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలతో కొనసాగిన ఊరేగింపు కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తి పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ గ్రామస్తులు సందడి చేశారు.