చెక్కులు పంపిణీ చేసిన MLA కౌసర్

HYD: ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఎంతో మంది పేద ప్రజలు లబ్ధి పొందాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దీన్ అన్నారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు మంజూరు అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఇది ప్రజలకు ఒక వరంగా మారిందని అన్నారు. తన నియోజకవర్గ పరిధిలో అర్హులందరికీ చెక్కులు వచ్చేలా ప్రత్యేక దృష్టి పెట్టమని MLA పేర్కొన్నారు.