ఎనిమిది పేకాటరాయుళ్లపై కేసు నమోదు
VKB: ఉద్దండాపూర్‌లో పేకాడుతున్న ఎనిమిది మందిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో కొంత మంది పేక ఆడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీసులు పేకాటస్థావరంపై దాడిచేశారు. ఈ దాడిలో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 19410 నగదును స్వాధినం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.