'కోచింగ్ సెంటర్స్ పై చర్యలు తీసుకోవాలి'

'కోచింగ్ సెంటర్స్ పై చర్యలు తీసుకోవాలి'

NLG: ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి సతీశ్‌ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం దేవరకొండలో విలేకరులతో మాట్లాడుతూ.. విద్యను వ్యాపారంగా మార్చి, అనుమతులు లేకుండా దేవరకొండ, కొండమల్లేపల్లిలలో కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్ నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.