డ్రైనేజీ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష
కృష్ణా: మొంథా తుఫాన్ నేపథ్యంలో ముంపు సమస్య తలెత్తకుండా డ్రైనేజీలను సమర్ధవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులను సూచించారు. సోమవారం అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో డ్రైనేజీ శాఖ అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. డ్రైనేజీల్లో వలకట్లు లేకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ బీ.కిరణ్ బాబు, డీఈ జే.బాబూ నాయక్, ఏఈఈ చిరంజీవి పాల్గొన్నారు.