ఖిల్లా రామలయాన్ని సందర్శించిన మేయర్
NZB: పునర్వసు నక్షత్రం సందర్భంగా శనివారం ఖిల్లా రామ మందిరంలోని శ్రీ రఘునాథ ఆలయంలో ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం వేదమూర్తులచే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మేయర్ కూరగాయల ఉమారాణి-రమేష్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీ సీతారాములను దర్శించుకుని, అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు.