రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు
కృష్ణా: గుడివాడలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకొని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా ట్రాఫిక్ ఎస్సై నాగరాజు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.