ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్
WGL: గ్రామ పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోసం జిల్లాలో నియమించిన నోడల్ అధికారుల పనితీరుపై జిల్లా కలెక్టర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నోడల్ అధికారులకు కేటాయించిన విధులను నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని సూచించారు.