విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతపురం కలెక్టర్

అనంతపురంలోని ఆదిమూర్తి నగర్‌లో గల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం 1,2ని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పిల్లలతో కింద కూర్చుని కలిసి భోజనం చేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తామని కలెక్టర్ అన్నారు.