ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి

E.G: గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో శుక్రవారం వెళ్లిన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా, మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురు కూలీలు పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.