కొమరాడ త్రిసభ్య కమిటీ ప్రమాణస్వీకారం
W.G: భీమవరం మండలం కొమరాడ-గొర్లమూడి సొసైటీ బ్యాంక్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీల నాయకులు కలిసి నూతనంగా ఎన్నికైన త్రిసభ్య కమిటీ ఛైర్మన్ రాట్నాల సత్యనారాయణతో ప్రమాణస్వీకారం చేయించారు.