అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
GDWL: కేటీదొడ్డి మండలం పాతపాలెం గ్రామం వద్ద అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను మండల పోలీసులు పట్టుకున్నారు. ఇవి కర్ణాటక రాష్ట్రానికి చెందిన ట్రాక్టర్లుగా గుర్తించారు. కృష్ణానది నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. అక్రమ రవాణాకు పాల్పడిన ఈ వాహనాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.