గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి: MLA
VKB: పరిగి నియోజకవర్గం, పూడూరు మండలం కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా పట్లోళ్ల దీపిక పాపి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమెకు ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ను సన్మానించి, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఆయన ప్రత్యేకంగా సూచించారు.