ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీపీ

KMM: నేలకొండపల్లిలో ఇటీవల ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ప్రమాద స్థలాన్ని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం పరిశీలించారు. రహదారిపై ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్కడ తక్షణమే ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.