'ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నాం'

కృష్ణా: ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లు నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం కోడూరు మండలం వీ. కొత్తపాలెంలో నూతన ఏటీఎం తరహా వాటర్ ప్లాంటును ఆయన ప్రారంభించారు. పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటి వినియోగం ద్వారా నీటి సంబంధిత వ్యాధుల సంక్రమణ నిరోధించవచ్చన్నారు.