ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్

KNR: ఇల్లందకుంట మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు ఎస్సై క్రాంతికుమార్ తెలిపారు. ఎస్సై మాట్లాడుతూ.. శంభునిపల్లికి చెందిన వసాల సంతోష్ మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుండగా పోలీస్ సిబ్బందితో పట్టుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.