హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని హెచ్చరించింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. బిల్లులో ఎల్పీజీ, గ్యాస్ ఛార్జీలు వసూలు చేయకూడదని పేర్కొంది. హోటల్ మోనూలో చూపించిన ధరనే తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.