పవన్ ఆరోగ్యం కోసం కొండగట్టులో ప్రత్యేక పూజలు

పవన్ ఆరోగ్యం కోసం కొండగట్టులో ప్రత్యేక పూజలు

TG: సైనసైటిస్‌తో బాధపడుతున్న AP ఉపముఖ్యమంత్రి పవన్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ జనసేన నాయకులు కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గ పార్టీ నేత మొగిలి పాలెం రమేష్ నేతృత్వంలో ఈ పూజలు సాగగా.. పవన్‌పై అంజన్న ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.