18 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్!

నిరుద్యోగులకు SBI శుభవార్త చెప్పింది. 18 వేల పోస్టులను తమ శాఖల్లో భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. 2025-26 ఫైనాన్షియల్ ఇయర్‌కు గానూ అతిపెద్ద రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఎస్బీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకాల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు, టెక్నికల్ టీమ్, క్లరికల్ స్టాఫ్ పోస్టులు ఉండనున్నాయి.