యంగంపల్లి సర్పంచ్‌గా తిరుపతిరావు
NGKL: తాడూరు మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. యంగంపల్లి సర్పంచ్‌గా తిరుపతిరావు తన సమీప ప్రత్యర్థి (కుందేళ్ల తిరుపతయ్య)పై 14 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎనిమిది వార్డు స్థానాలకు గ్రామస్థులు సభ్యులను ఎన్నుకున్నారు. తిరుపతిరావు గెలుపుతో గ్రామస్థులు బాణసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు.