CMRF చెక్కులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే

ATP: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర బాబు ప్రజలకు రేపు అందుబాటులో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజావేదిక వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. బాధితులు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు తీసుకోవాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.