VIDEO: డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు.. తప్పు తెలుసుకున్నాడు..!
CTR: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వ్యక్తికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో అతను తన తప్పును గుర్తించి వీడియో ద్వారా క్షమాపణలు తెలియజేశాడు. ఇకపై ఇలా చేయబోనని పేర్కొన్నాడు. ఇతరులు కూడా మద్యం సేవించి వాహనం నడపవద్దని విజ్ఞప్తి చేశాడు.