గ్రామాల్లో పర్యటించిన మడకశిర ఎమ్మెల్యే
సత్యసాయి: మడకశిర ఎమ్మెల్యే MS.రాజు మంగళవారం రాత్రి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ద్విచక్ర వాహనంపై సుడిగాలి పర్యటన చేశారు. వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్తగా టీడీ పల్లి తాండ, అచ్చంపల్లి, మరువపల్లి, ఆమిదాలగొంది గ్రామాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.