SRHతో మ్యాచ్.. గ్రీన్ బౌలింగ్ వేస్తాడా?
MIతో మ్యాచులో బౌలింగ్ చేయకపోవడంతో KKR ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ విమర్శలపాలైన సంగతి తెలిసిందే. బౌలింగ్ చేయనప్పుడు రూ.25 కోట్లు ఎందుకనే ప్రశ్నలూ వినిపించాయి. దీంతో SRHతో ఇవాళ్టి మ్యాచులో గ్రీన్ బౌలింగ్ వేయనున్నట్లు తెలుస్తోంది. అతను ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను KKR షేర్ చేసింది. కాగా సర్జరీ వల్ల కొన్ని మ్యాచులకు గ్రీన్ బౌలింగ్ చేయలేడని ఆస్ట్రేలియా క్రికెట్ తెలిపింది.