ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చర్యలు

MNCL: ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ అన్నారు. పనుల జాతరలో భాగంగా శనివారం జన్నారంలోని గాంధీ నగర్‌లో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ మంచి విద్యను అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.