కాళేశ్వరం నీటితో హల్దీ వాగులో జలకళ

కాళేశ్వరం నీటితో హల్దీ వాగులో జలకళ

MDK: వెల్దుర్తి మండలంలోని హల్దీ వాగులోకి కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడంతో మండుటెండల్లో వాగు ఉప్పొంగుతూ కనిపిస్తోంది. నీరు రావడంతో పరిసర ప్రాంతాల్లోని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. చివరి దశలో ఉన్న పంటలకు ఈ నీళ్లు ప్రాణాధారంగా మారుతాయి. దాదాపు వెయ్యి ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.