వీధి కుక్కల స్వైర విహారం

KMR: రాజంపేట మండల కేంద్రంలోని శ్రీ శారదా శిశు మందిర్ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల విద్యార్థిపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థి ధనుంజయ్ (4) మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు.అటుగా వచ్చినటువంటి వీధి కుక్కలు ఒకసారిగా బాలుడి బాలుడిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు.