స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు కండీషన్

స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులకు కండీషన్

కేరళలో వచ్చే నెల స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడి రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఎన్నికలొస్తే గానీ నాయకులు తమకు కనిపించరని స్థానిక స్వతంత్ర రైతు సంఘం (KIFA) అభ్యర్థులకు ఓ కండీషన్ పెట్టింది. రైతుల ఓట్లు కావాలంటే తాము తయారు చేసిన అల్టిమేటంపై సంతకాలు చేయాలని షరతు విధించింది. లేదంటే అంతా కలిసి ఎన్నికలను బహిష్కరిస్తామని తేల్చి చెప్పారు.