ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నెల్లూరు: నగరంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తుకూరు రోడ్డు వడ్డీ పాలెం సమీపంలో స్కూటీని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడకక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.