జిల్లాలో సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఇవే..!
కడప: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 28,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 27,731 మంది రెగ్యులర్ విద్యార్థులు, 421 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. కందిమల్లాయపల్లె, కమలాపురం, వేంపల్లె, మైదుకూరు, వల్లూరు, ఎగువపేట కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.