సమాజ సేవలో నిమగ్నం కావాలని: కలెక్టర్
NLG: పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు సమాజ సేవలో నిమగ్నం కావాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన వెంకటరమణ పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్య ప్రణాళక అధికారిగా ఆయన అందించిన సేవలను కొనియాడారు. ప్రణాళికల రూపకల్పనలో ఆయన చూసిన నిబధ్దత, కృషి ప్రశంసనీయమైనదని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం వెంకటరమణను శాలువాతో సన్మానం చేశారు.