21వ వార్డులో పారిశుధ్య స్పెషల్ డ్రైవ్
SRCL: 99 రోజుల 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా వేములవాడ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 21వ వార్డులో నిర్వహిస్తున్న పారిశుధ్య స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని స్థానిక కౌన్సిలర్ నరాల శేఖర్‌తో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు.