ఢిల్లీ పేలుడు.. 42 కీలక ఆధారాల సేకరణ

ఢిల్లీ పేలుడు.. 42 కీలక ఆధారాల సేకరణ

ఢిల్లీ పేలుడు ఘటన జరిగిన ప్రదేశం నుంచి ఫోరెన్సిక్ బృందం కీలక వస్తువులను సేకరించింది. పేలుడు పదార్థాలు, ఇతర ఆధారాలను నిర్ధారించడానికి ఘటనా స్థలం నుంచి మొత్తం 42 వస్తువుల శాంపిల్స్‌ను తీసుకుంది. ఈ 42 శాంపిల్స్‌ను ల్యాబ్‌లో పరీక్షలు జరపనున్నారు. ఈ పరీక్షల ఫలితాలు పేలుడుకు ఉపయోగించిన పదార్థాలను, పేలుడు వెనుక కుట్రను తేల్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.