VIDEO: మదనపల్లెలో క్యాండిల్ ర్యాలీ నిర్వహణ

VIDEO: మదనపల్లెలో క్యాండిల్ ర్యాలీ నిర్వహణ

అన్నమయ్య: మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మిషన్ కాంపౌండ్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మహేంద్ర మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజల మానప్రాణాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని పిలుపునిచ్చారు.