సీపీఐ శతజయంతి ఉత్సవాల బస్సు ఆలేరు చేరిక
BHNG: భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి పురస్కరించుకొని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవాల బస్సు జత శనివారం కొలనుపాక నుంచి ఆలేరు చేరింది. కొలనుపాకలో ఆరుట్ల దంపతులకు శ్రద్ధాంజలి ఘటించిన నాయకులు, ఆలేరుకు చేరుకున్న అనంతరం కట్కూరి దంపతులు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలలు సమర్పించారు.