యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంలోని పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొండకింద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకొని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది.