VIDEO: యూరియా బస్తాల కోసం రోడ్డు ఎక్కిన రైతులు

MHBD: జిల్లాలో యూరియా కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈరోజు ఉదయం యూరియా బస్తాల కోసం రైతన్నలు రోడ్డెక్కారు. తోర్రుర్ డివిజన్‌లోని వరంగల్- ఖమ్మం రహదారిపై బైటాయించి నిరసన తెలిపి, సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. ఈ రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.