తుఫాన్ జాబితాలో కడప జిల్లాను చేర్చాలి.!

తుఫాన్ జాబితాలో కడప జిల్లాను చేర్చాలి.!

KDP: తుఫాన్ జాబితాలో కడప జిల్లాను చేర్చాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా చింతకొమ్మదిన్నె మండలంలోని కొలుమూల పల్లెలో తుఫాన్ దాటికి దెబ్బతిన్న చామంతి పూల తోటలను ఆయన పరిశీలించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తుఫాన్ జాబితాలో కడప జిల్లా పేరు చేర్చకపోవడం అన్యాయం అన్నారు.